6.4.20

ఉందిలే మంచి కాలం ముందుముందునా

ఉందిలే మంచి కాలం ముందుముందునా
ఈ పాటలోని కొన్ని lines మార్చి నేను రాసిన పాట ఇది 

ఉందిలే మంచి కాలం ముందుముందునా
అందరూ సుఖపడాలి నందనందనా ll 

ఏమిటో నీమాటకర్థమేమిటో 
రానున్న రోజులని తలచుకుంటే 
నోట మాట లేదుగా ఆ ఆ ll 

ఏమిటేమిటేమిటే మంచి కాలమం అంటన్నావ్  
ఎలాఉంటదో కొంచెం విశదంగా చెప్పూ

అందరు కలసి ఇళ్ళళ్ళో ఉన్నరోజు 
సుచి శుభ్రతను పాటించినరోజు
మన పెద్దాయన మాటలు విన్నరోజు 

ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో
అదిగో చూడు రేపో నేడో చిన్నయ్యో


భలే భలే బాగా చెప్పావ్ కాని అందుకు మనం
ఏం చేయాలో అది కూడా  నువ్వే చెప్పూ

చేతులు శుభ్రంగా కడుక్కోవాలి  
ముఖానికి మాస్కులు ధరించాలి  
ఇంటి లోపలే నువ్వు ఉండి తీరాలి 

సహకారమే మన వైఖరి అయితే 
ఉపకారమే మన ఊపిరి అయితే

పేద గొప్ప భేదం పోయి అందరూ
నీది నాదని వాదం లేక ఉందురూ

ఆ రోజెంతో దూరం లేదు అన్నయ్యో
అదిగో చూడు నేడో రేపో చిన్నయ్యో

అధికారులకి నువ్వు సహకరిస్తే 
కరోనాని నువ్వు తన్ని తరిమేయొచ్చు 
కోవిడ్ నే నువ్వు జయించొచ్చు 

ఉందిలే మంచి కాలం ముందుముందునా
అందరూ సుఖపడాలి నందనందనా 

No comments:

Post a Comment