19.4.20

కంటికి కనిపించకుండానే యుద్ధం చెయ్యాలి - కంటికి కనిపించని శత్రువు(కరోనా)తో

కంటికి కనిపించకుండానే యుద్ధం చెయ్యాలి - కంటికి కనిపించని శత్రువు(కరోనా)తో .....@శ్వేత 19/04/2020



16.4.20

నేను నేనుగా ఉండలేను - నా తలపులో నీ రూపం లేకుంటే

నేను నేనుగా ఉండలేను -  నా తలపులో నీ రూపం లేకుంటే  ... @శ్వేత 16/04/2020



11.4.20

పాడవోయి భారతీయుడా

వెలుగు నీడలు చిత్రంలోని పాట నేటి పరిస్థితికి ప్రతీ line సరిగ్గా సరిపోతుంది మీరే చూడండి ఒకసారి

పాడవోయి భారతీయుడా
ఆడి పాడవోయి విజయగీతికా ఆ ఆ

నేడె స్వాతంత్ర్య దినం వీరుల త్యాగ ఫలం
నేడె నవోదయం నీదే ఆనందం ఓ..

స్వాతంత్ర్యం వచ్చెననీ సభలె చేసీ
సంబర పడగానే సరిపోదోయి
సాధించిన దానికి సంతృప్తిని పొందీ
అదె విజయమనుకుంటె పొరపాటోయి
ఆగకోయి భారతీయుడా
కదలి సాగవోయి ప్రగతి దారులా

ఆకాశం అందుకొనే ధరలొక వైపు
అదుపు లేని నిరుద్యోగమింకొక వైపు
అవినీతి బంధుప్రీతి చీకటి బజారూ
అలముకొన్న నీ దేశం ఎటు దిగజారు
కాంచవోయి నేటి దుస్థితి
ఎదిరించవోయి ఈ పరిస్థితీ ఈ ఈ

పదవీ వ్యామోహాలు కులమత భేదాలు
భాషా ద్వేషాలు చెలరేగె నేడు
ప్రతి మనిషి మరియొకని దోచుకొనె వాడే
తన సౌఖ్యం తన భాగ్యం చూచుకొనె వాడే

స్వార్ధమీ అనర్ధకారణం
అది చంపుకొనుట క్షేమదాయకం మ్ మ్ మ్ మ్

సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం నీ లక్ష్యం
సమ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం
సకల జనుల సౌభాగ్యమె నీ లక్ష్యం
ఏక దీక్షతో గమ్యం చేరిన నాడే
లోకానికి మన భారతదేశం అందించునులె శుభసందేశం

లోకానికి మన భారతదేశం
అందించునులె శుభ సందేశం

లోకానికి మన భారతదేశం
అందించునులె శుభ సందేశం

6.4.20

ఉందిలే మంచి కాలం ముందుముందునా

ఉందిలే మంచి కాలం ముందుముందునా
ఈ పాటలోని కొన్ని lines మార్చి నేను రాసిన పాట ఇది 

ఉందిలే మంచి కాలం ముందుముందునా
అందరూ సుఖపడాలి నందనందనా ll 

ఏమిటో నీమాటకర్థమేమిటో 
రానున్న రోజులని తలచుకుంటే 
నోట మాట లేదుగా ఆ ఆ ll 

ఏమిటేమిటేమిటే మంచి కాలమం అంటన్నావ్  
ఎలాఉంటదో కొంచెం విశదంగా చెప్పూ

అందరు కలసి ఇళ్ళళ్ళో ఉన్నరోజు 
సుచి శుభ్రతను పాటించినరోజు
మన పెద్దాయన మాటలు విన్నరోజు 

ఆ రోజెంతో దూరం లేదోరన్నయ్యో
అదిగో చూడు రేపో నేడో చిన్నయ్యో


భలే భలే బాగా చెప్పావ్ కాని అందుకు మనం
ఏం చేయాలో అది కూడా  నువ్వే చెప్పూ

చేతులు శుభ్రంగా కడుక్కోవాలి  
ముఖానికి మాస్కులు ధరించాలి  
ఇంటి లోపలే నువ్వు ఉండి తీరాలి 

సహకారమే మన వైఖరి అయితే 
ఉపకారమే మన ఊపిరి అయితే

పేద గొప్ప భేదం పోయి అందరూ
నీది నాదని వాదం లేక ఉందురూ

ఆ రోజెంతో దూరం లేదు అన్నయ్యో
అదిగో చూడు నేడో రేపో చిన్నయ్యో

అధికారులకి నువ్వు సహకరిస్తే 
కరోనాని నువ్వు తన్ని తరిమేయొచ్చు 
కోవిడ్ నే నువ్వు జయించొచ్చు 

ఉందిలే మంచి కాలం ముందుముందునా
అందరూ సుఖపడాలి నందనందనా 

కరోనాకి అక్షర నీరాజనం

 కరోనాకి అక్షర నీరాజనం ... 

అయ్య చెప్పిన మాట విందాం
ఆనందంగా ఉందాం
ఇంట్లోనే ఉందాం
(ఈల వేసుకుంటుందాం)
ఈ మహమ్మారిని తరిమికొడదాం

ఉతికి ఆరేస్తున్నారు అన్నలు
ఊరి పొలిమేరలు దాటితే
ఋణం తీర్చుకుందాం సేవచేసినవారికందరికీ

ఎక్కిడికి వెళ్ళొద్దు
ఏమీ అంటించుకోవద్దు
ఐకమత్యంగా ఉందాం

ఒక్కరి కోసం అందరమేకమవుదాం
ఓడిద్దాం మనకొచ్చిన మహమ్మారిని
ఔరా అని అనుకోవలందరూ

అందరి ఆచరణ చూసి - అంతరార్థమెరిగి మసలుకొందాం
అః అని మనల్ని మెచ్చుకోవాలి - అన్ని దేశాలవారు

కరోనాని జయించుదాం - కంట్రీని కాపాడుకుందాం ..... @శ్వేత 6-4-2020