24.1.20

పూస్తకాలే నా ప్రపంచం

శ్వేత ...... పూస్తకాలే నా ప్రపంచం

పూస్తకాలే నా ప్రపంచం 
 పుటలే  నా నేస్తాలు 
  
మౌనమే నా భాష
అక్షరాలే నా శ్వాశ

నిరాశను నిర్మూలించాలన్నా
నిస్పృహను నిద్రపుచ్చాలన్నా 

గుండె మంటలనార్పాలన్నా
పరాకును పారద్రోలాలన్నా 

మండే హృదయానికి మందు రాయాలన్నా 
ఆనందపడినా - అచ్చెరువొందినా 

అన్నింటికి  ఆయుధాలు నా అక్షరాలే 22-01-2020



No comments:

Post a Comment