24.1.20

పూస్తకాలే నా ప్రపంచం

శ్వేత ...... పూస్తకాలే నా ప్రపంచం

పూస్తకాలే నా ప్రపంచం 
 పుటలే  నా నేస్తాలు 
  
మౌనమే నా భాష
అక్షరాలే నా శ్వాశ

నిరాశను నిర్మూలించాలన్నా
నిస్పృహను నిద్రపుచ్చాలన్నా 

గుండె మంటలనార్పాలన్నా
పరాకును పారద్రోలాలన్నా 

మండే హృదయానికి మందు రాయాలన్నా 
ఆనందపడినా - అచ్చెరువొందినా 

అన్నింటికి  ఆయుధాలు నా అక్షరాలే 22-01-2020



19.1.20

మురిసిపోతోంది మౌనం

మురిసిపోతోంది మౌనం - మదిలో మెదిలే మధురూహలకి @శ్వేత 19-01-2020


ఙ్ఞాపకాలు కన్నెర్ర చేస్తున్నాయి

ఙ్ఞాపకాలు కన్నెర్ర చేస్తున్నాయి..ఎదలోతుల్లో నిక్షిప్తం చేశానని..@శ్వేత 19-01-2020


మనోభావాలన్నీ మటుమాయమవుతున్నాయి

మనోభావాలన్నీ మటుమాయమవుతున్నాయి - మస్తిష్కాన్ని మధిస్తుంటే @శ్వేత 18-01-2020



18.1.20

ఉక్కిరి బిక్కిరి అవ్వాలనుంది

ఉక్కిరి బిక్కిరి అవ్వాలనుంది - నీ ఉక్కుసంకెళ్ళ కౌగిలిలో .... @శ్వేత 18-01-2020


అంతర్యామి అగుపడతాడు

అంతర్యామి అగుపడతాడు - అంతర్ముఖుడవై నువ్వు యోచించి యాచిస్తే @శ్వేత 18-01-2020



శుభరాత్రి సందేశాలు 191 నుండి 200 వరకు

శుభరాత్రి సందేశాలు 191 నుండి 200 వరకు













17.1.20

ఏ విధంగా అర్పించాలి .... నా మనో పుష్పాన్ని నీ పాదాల చెంతకు

ఏ విధంగా అర్పించాలి .... నా మనో పుష్పాన్ని నీ పాదాల చెంతకు @శ్వేత 17/01/20



4.1.20

మానవత్వం మరుగున పడిపోతుంది

మానవత్వం మరుగున పడిపోతుంది .... మూలాలని మనం మరచిపోతే @శ్వేత 04-01-2020