చూడ చక్కని నా ఎంకి ... శ్వేత
చూడ ముచ్చటగున్నది
చూడ చక్కని నా ఎంకి
చూడగానే నా ఎంకి మోము
చూపు తిప్పుకోలేరెవ్వరు
చూపులోన నా ఎంకి
చెందురుని పోలి ఉండు
చందమామకేమి ఎరుక
నా చెలి అందమంటే
ముద్దులాడితే తన మోమును
మనసు నిండు మురిపెమ్ముతోడ
నా ఎంకి ముఖము చూసి
రేరాజు ముఖము చిన్నబోయే......06/6/2017
No comments:
Post a Comment