మనో సంఘర్షణ
మనో సంఘర్షణ ఎవ్వరికైనా దీనికి మించిన పెద్ద వ్యాధి మరొకటి లేదు జయించిన వాడు జీవించి ఉంటాడు, లేనివాడు విగతుడవుతాడు. ఈ మందులేని మనోరోగానికి నిత్యమూ ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు.
మనసున్నవారే మరు నిమిషం ఏం జరుగుతుందా అని ఆలోచిస్తూ వుంటారు. మనస్సు అనేది లేని వారు అంటే ఏం జరుగినా మన మంచికే అని అనుకునే వారు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కానీ మనిషి అన్న తరవాత ఎదుటి వ్యక్తి గురించి ఆలోచించకుండా ఎలా ఉండగలుగుతాడు.... అదీ ఆ ఎదుటి వ్యక్తి తన రక్తసంబంధం అయితే ఇంకా ఆలోచించకుండా ఉండగలడా ....ఉండలేడు కదా ..... కానీ తనవారైన, పరాయివారైన వారు వేసే అడుగు ఎదుట ముళ్ళున్నాయో, రాళ్ళున్నాయో చెప్పటం మన ధర్మం. వినకుంటే వారి ఖర్మం. వినలేదు కదా వారికేమైనా అవుతుందేమో అని మనం మధనపడితే ఒరిగేది ఏమీ లేదు. మనకి మనోవ్యాధి తప్ప. ఈ మనోవ్యాధే మనకి రాబోయే వ్యాధులకి నాంది అవుతుంది. ఆదిలోనే మనోవ్యాధిని ఆపగలిగితే మనకి జీవితాంతం ఏ రోగాలు రాకుండా ఉంటాయి. అలా చెప్పటం ఎవరికైనా సులువే .... ఆచరించినవారికే తెలుస్తుంది దాని బరువెంత అనేది.