సతతము నిన్నే స్మరింతును ....@శ్వేత
ముల్లోకాలను నీ ఉదరమున ఇముడ్చుకునే కృష్ణా
దేవకి గర్భంబున ఎలా ఒదిగి ఉంటివయ్యా ll
దేవకి గర్భంబున ఎలా ఒదిగి ఉంటివయ్యా ll
పాలు పెరుగు వెన్నలన్నీ నీ ఇంటి నిండా ఉండ
మట్టిముద్దపైన ఏల మనసు పడితివయ్యా ll
మట్టిముద్దపైన ఏల మనసు పడితివయ్యా ll
నిన్ను మెచ్చి నీ వెంటపడిన గోపికలను మురిపించి
నిరతము నిన్నే పూజించే వనితల వలువలేల గొనిపోతివయ్యా ll
నిరతము నిన్నే పూజించే వనితల వలువలేల గొనిపోతివయ్యా ll
మురిసె గోకులవాసులంతా నీ ఆటపాటలతో
అట్టివారింట వెన్న దొంగాడి కయ్యాలేల పెట్టితివయ్యా ll
అట్టివారింట వెన్న దొంగాడి కయ్యాలేల పెట్టితివయ్యా ll
కడు దుర్లభమైన నీ పాద దర్శనం కోసం ముల్లోకాలు వేచి చూస్తాయి
అట్టి నీ పాద స్పర్శ ఇట్టే కాళిందునికెలా దక్కేనయ్యా ll
అట్టి నీ పాద స్పర్శ ఇట్టే కాళిందునికెలా దక్కేనయ్యా ll
సతతము నిన్నే స్మరించే నన్ను విస్మరించి
అన్యులకేల ముక్తినొసగుతున్నావయ్యా ll
అన్యులకేల ముక్తినొసగుతున్నావయ్యా ll
....23 Aug 2019