23.4.17

Chakraala Kallavaada Cheraraakura ..... Folk Song

Chakraala Kallavaada Cheraraakura ..... Folk Song
Written By .... P.L.N.Prasad
Music ..... G.Shambhu Prasad
Singers ..... Sahiti & G.Shambhu Prasad

చక్రాల కళ్ళవాడ ..చేర రాకురా..
చక్రమే పట్టువాడ ..చెంగు విడువరా..!!
చీర లే దోచువాడ ..చెంత రాకురా..
చిన్నదాని సొగసులన్ని..దోచబోకురా..!!
సెలయేటి పొంగులా..కులుకు లేలనే..
కలువ కళ్ల సొగసులా..పిలుపు లేలనే..
చెంత పిలిచి సిగ్గుల భాస లేలనే..
పట్టు విడువనంచు నే ప్రతిన బూనితి !!
దారి విడువక నిలచిన వాడికి
దోచుట ఒకటే తెలుసునుగా ..
నను దోచుట ఓకటే. తెలుసునుగా..
దోచిన వారిని దాచమందురా..
కొరితి నీవే రావా..
దొరవై నను ఏలు బిరాన..!!
!! చక్రాల కళ్ళవాడ చేర రాకురా !!
అలల నడకల గలా గల కన్నెకు
పిలుచుట ఒకటే తెలుసును గా
నను పిలుచుట ఒకటే తెలుసునుగా.
దోచట మంటే దర్శనమే..
వేగమే నేను రానా..
హరి కావగ లేడా. జగాన...
!!చక్రాల కళ్ళవాడ చెర రాకురా !!