28.8.18
శుభోదయ సందేశాలు 191 నుండి 200 వరకు
శుభోదయ సందేశాలు 191 నుండి 200 వరకు
27.8.18
నీ స్మృతుల స్వప్నాలు కళ్ళల్లో కదలాడుతూనే ఉన్నాయి - కంటికి వెలుగు దూరమైనప్పటికీ
నీ స్మృతుల స్వప్నాలు కళ్ళల్లో కదలాడుతూనే ఉన్నాయి - కంటికి వెలుగు దూరమైనప్పటికీ .@శ్వేత...27/8/2018
నిత్య జ్ఞాపకమై నన్ను వెంటాడుతూ ఉంటాయి - నీ సూదంటి కొంటి చూపులు
నిత్య జ్ఞాపకమై నన్ను వెంటాడుతూ ఉంటాయి - నీ సూదంటి కొంటి చూపులు .... శ్వేత 06 Sep 2017
6.9.17
తలపులు తట్టి లేపి వలపులు దోచుకున్నావు - పిలుపు గాలమేసి
తలపులు తట్టి లేపి వలపులు దోచావు - పిలుపు గాలమేసి .... శ్వేత 06 Sep 2017
ఎగిరిపోదామా - హద్దులు లేని ఆకాశానికి, నిద్దురలేని లోకానికి
ఎగిరిపోదామా - హద్దులు లేని ఆకాశానికి, నిద్దురలేని లోకానికి .... శ్వేత 06 Sep 2017
కమ్మగా నిదురపోదామా - కనుదోయిలో వెన్నెల నింపుకొని
కమ్మగా నిదురపోదామా - కనుదోయిలో వెన్నెల నింపుకొని .... శ్వేత 6 Sep 2017
28.8.17
ఋతువులతో గలాటాలెందుకు ... శ్వేత
ఋతువులతో గలాటాలెందుకు ... శ్వేత
వసంతఋతువుతో వయ్యారాలెందుకు
గ్రీష్మఋతువుతో గిల్లికజ్జాలెందుకు
వర్షఋతువుతో వాదులాటెందుకు
శరదృతువుతో సరసాలెందుకు
హేమంతఋతువుతో హాస్యమెందుకు
శిశిరఋతువుతో సమరమెందుకు
ఋతువులతో గలాటాలెందుకు మనకు ..... 28 Aug 2017
మందారంలా ముడుచుకుని, సిరిమల్లల్లే సిగ్గుపడింది - సొట్టబుగ్గల సుందరి
మందారంలా ముడుచుకుని, సిరిమల్లల్లే సిగ్గుపడింది - సొట్టబుగ్గల సుందరి ...
శ్వేత 28 Aug 2017
చెలికాని నవ్వులకే గువ్వల్లే ఒదిగిపోయింది - పసిడివంటి పడుచుప్రాయం
చెలికాని నవ్వులకే గువ్వల్లే ఒదిగిపోయింది - పసిడివంటి పడుచుప్రాయం ... శ్వేత 28 Aug 2017
నిను తలచిన ప్రతిక్షణం .... శ్వేత
నిను తలచిన ప్రతిక్షణం .... శ్వేత
బ్రతుకంటే చేదన్నది
బంధుత్వమే రోతన్నది
అనురాగమే లేదన్నది
ఆప్యాయత కావాలన్నది
స్నేహమంటే బరువన్నది
సాహసాలు వద్దన్నది
అరుదెంచిన అవకాశాలు వద్దన్నది
ఆకశాన ఊయలలూగుతానన్నది
నిను తలచిన ప్రతిక్షణం
విలపించును నా మది .... 28 Aug 2017
కవితల పూదోట .... శ్వేత
కవితల పూదోట .... శ్వేత
అలసత్వమెరుగని నా అక్షరాలని
పటుత్వమున్న మంచి పదాలని
మృదుత్వమున్న (మృదువైన) మాటలతో
సరళత్వమున్న సంభాషణలతో
అస్తిత్వం కోల్పోతున్న అక్షరాలని
కమ్మని కవితల పూదోటలో విహరింపచేస్తున్నా ..... 28 Aug 2017
కమ్మని కవితల పూదోటలో విహరిస్తున్నాయి - అలుపెరుగని అక్షరాలు
కమ్మని కవితల పూదోటలో విహరిస్తున్నాయి - అలుపెరుగని అక్షరాలు ...శ్వేత 28 Aug 2017
23.7.17
మది ముంగిట రంగవల్లులద్దాను - ఎద కోవెలలో నాస్వామి ఉన్నాడని తలచి
మది ముంగిట రంగవల్లులద్దాను - ఎద కోవెలలో నాస్వామి ఉన్నాడని తలచి.... శ్వేత...22-7-17
6.6.17
చూడ చక్కని నా ఎంకి ... శ్వేత
చూడ చక్కని నా ఎంకి ... శ్వేత
చూడ ముచ్చటగున్నది
చూడ చక్కని నా ఎంకి
చూడగానే నా ఎంకి మోము
చూపు తిప్పుకోలేరెవ్వరు
చూపులోన నా ఎంకి
చెందురుని పోలి ఉండు
చందమామకేమి ఎరుక
నా చెలి అందమంటే
ముద్దులాడితే తన మోమును
మనసు నిండు మురిపెమ్ముతోడ
నా ఎంకి ముఖము చూసి
రేరాజు ముఖము చిన్నబోయే......06/6/2017
My Childhood Friends
My Childhood Friends...... 35 సంవత్సరాల తరవాత కలుసుకున్నా ....... నా చిన్ననాటి స్నేహితులని.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)