29.12.15

కనుమరుగౌతున్న భావాల పుప్పొడి - కవితాసుమాలలో

కనుమరుగౌతున్న భావాల పుప్పొడి - కవితాసుమాలలో ...... శ్వేత 29 Dec 2015


28.12.15

చూపులు వంతెన కడుతున్నాయి - ఇరు మనసులను ఏకం చెయ్యాలని

చూపులు వంతెన కడుతున్నాయి - ఇరు మనసులను ఏకం చెయ్యాలని ..... శ్వేత 28 Dec 2015


మదిలో జ్ఞాపకాలు పదిలమే - కనురెప్పల చూరుల నుండి ఎన్ని జాలువారినా

మదిలో జ్ఞాపకాలు పదిలమే - కనురెప్పల చూరుల నుండి ఎన్ని జాలువారినా .... శ్వేత 28 Dec 2015





29.10.15

శ్వేత ...... బాసలన్నీ మాయమాయే

శ్వేత ...... బాసలన్నీ మాయమాయే

ఊసులన్ని నిజమేనని బాసచేసితివానాడు
మదిమాటున బాసలన్నీ మసకబారెను  నేడు
నీతోటి నడకలన్నీ నీటిమీద రాతలాయే చూడు
విసిగి వేసారిన జీవితం  అంతమొనర్చ, విసిరేసాడు దేహాన్ని సాగరుడు  .... శ్వేత 11 July 2015


America Photos

America Photos







శ్వేత ..... చుక్క నీటి కోసం

శ్వేత ..... చుక్క నీటి కోసం

అన్నార్తులను ఆదుకునే అన్నదాత
ఆకలితో అలమటిస్తున్నాడు 
దిక్కులు పిక్కటిల్లేలా గద్దిస్తున్నాడు 

గర్జించటం తెలిసిన ఓ మేఘమా వర్షించవా అని 
చుక్క నీరు నోచుకోని
బక్కచిక్కిన దేహంతో
బ్రతికున్నదేందుకో తెలియక 

భగవంతుడిని నిందిస్తూ
భారంగా బ్రతుకీడుస్తూ 
భూమికి భారంగా నేనెందుకు బ్రతికున్నానా అని రోదిస్తూ...... 29 Oct 2015


శ్వేత ....... మనసా ఎక్కడున్నావు

శ్వేత ....... మనసా ఎక్కడున్నావు

అల్లరి మాటలతో మనసుకి మత్తెక్కించి
చల్లగ సరసాలాడుతూ
మెల్లగ ఎదనే గిల్లి 

బిందువంత ప్రేమ జూపి
సింధువులా మనసునాక్రమించి 

మాటలతో మదిలో తుఫాను రేపి
మనసు విరిచి పారేసింది

నాదారిన పోతున్న నన్ను
పిలచి, మురించి, వలచిన చిన్నది

మనసిమ్మని అడిగి, ముక్కలు చేసి విసిరేసింది
అలసట తెలియని ఓ మనసా
నను మరవకుమా, దరికి చేరుమా
ఎక్కడున్నావమ్మా ఓ నామనసా ! 29 Oct 2015


నీ అల్లరి చూపుల్ని దాచలేను - నా ఆశల దోసిళ్ళలో

నీ అల్లరి చూపుల్ని దాచలేను - నా ఆశల దోసిళ్ళలో ..... శ్వేత 29 Oct 2015



శ్వేత ....... ఒంటరి పక్షి

శ్వేత ....... ఒంటరి పక్షి

కాయం గాయమై, హృదయం ముక్కలై
నిన్నటి కబురులే నేటి జ్ఞాపకాలై

మిగిల్చిపోయావు తీయని గురుతులు నాకై
జీవిస్తున్నాను నేను విగతజీవినై
ఒంటరి పక్షినై ..... 29 Oct 2015


శ్వేత ........ దూరమన్నది లేదుగా - మన ఎద మాటున

శ్వేత ........ దూరమన్నది లేదుగా - మన ఎద మాటున

కరిగిపోని కలలెన్నో - కనురెప్పల దుప్పటి మాటున
కలత వీడని కనులెన్నో - ప్రతి హృది మాటున

నలతెరుగని హృది ఉందా - ఈ పృధివి(విశ్వం) మాటున
కల్మషమన్నది లేదుగా - పసిహృదయం మాటున

మోసమన్నది తెలియదుగా - మన ప్రేమ చాటున
దూరమన్నది లేదుగా - మన ఎద మాటున ..... 29 Oct 2015


కనురెప్పల దుప్పటి కప్పుతున్నా - కలలు కరిగిపోకుండా

కనురెప్పల దుప్పటి కప్పుతున్నా - కలలు కరిగిపోకుండా ..... శ్వేత 29 Oct 2015


నీ రూపాన్నేప్పుడూ బంధిస్తూనే(కౌగిలిస్తూనే) ఉంటాను - కనురెప్పల కౌగిళ్ళలో

నీ రూపాన్నేప్పుడూ బంధిస్తూనే(కౌగిలిస్తూనే) ఉంటాను - కనురెప్పల కౌగిళ్ళలో ..........శ్వేత 29 Oct 2015


ప్రతిరేయి మదికి తప్పని తిప్పలు - మూతపడని కనురెప్పల నొప్పులతో

ప్రతిరేయి మదికి తప్పని తిప్పలు - మూతపడని కనురెప్పల నొప్పులతో ..........శ్వేత 29 Oct 2015